![]() |
![]() |

త్వరలో దీపావళి పండగ రాబోతున్న సందర్భంగా ఆల్రెడీ షోస్ అన్నీ కూడా ఆ కాన్సెప్ట్ మీద రావటానికి సిద్ధంగా ఉన్నాయి. ఇక ఈటీవీలో "ఈ దీపావళికి మాస్ జాతర" పేరుతో ఆల్రెడీ ఒక షో రెడీ అయ్యింది. ఆ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఈ షోకి హోస్ట్ గా ప్రదీప్ కనిపించాడు. అలాగే నాగబాబు, శేఖర్ మాష్టర్ వచ్చారు. "ప్రతీ ఈవెంట్ జాతరలా ఉంటుంది. ఈ ఈవెంట్ మాస్ జాతరలా ఉంటుంది." అని చెప్పాడు ప్రదీప్. " ది రియల్ ఓజిస్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ ఆర్ బ్యాక్" అంటూ నాగబాబు, శేఖర్ మాష్టర్ ని స్టేజి మీదకు పిలిచాడు. "ఈ దీపావళి వచ్చే దీపావళి వరకు యాద్ ఉంటది" అని చెప్పాడు ప్రదీప్.
"మీ స్మైల్ కి చాలామంది ఫాన్స్ ఉన్నారు తెలుసా బాబు గారు" అన్నాడు శేఖర్ మాష్టర్. "ఊరుకో శేఖర్.. నీ డాన్స్ కి మాత్రం ఎంత మంది ఫాన్స్ ఉన్నారు" అంటూ ఆట పట్టించడానికి నాగబాబు శేఖర్ మాష్టర్ నడుము గిల్లేసాడు. ఇక శేఖర్ మాష్టర్ ని చూసి ఆది తెగ నవ్వేసాడు. ఇక బుల్లితెర మీద కనిపించే హీరోయిన్స్, కమెడియన్స్ అంతా వచ్చి డాన్స్ లు వేశారు. అలాగే చివరికి అందరూ కలిసి దీపావళి టపాసులు కాల్చి పండగను సెలెబ్రేట్ చేసుకున్నారు.
![]() |
![]() |